పోలీసుల కార్డెన్ సెర్చ్..27 బైకులు సీజ్

పోలీసుల కార్డెన్ సెర్చ్..27 బైకులు సీజ్

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పరిధిలో రాత్రి పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలోని ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. సరైన డాక్యుమెంట్స్ లేని 27 బైక్ లను రాజేంద్రనగర్  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన 10 వంటగ్యాస్ సిలిండర్లను స్టేషన్ కు తీసుకెళ్లారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని  స్థానికులను ఏసీపీ శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. కార్డెన్ సెర్చ్ లో ఎస్వోటీ టీమ్  లతోపాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి 180 సిబ్బంది పాల్గొన్నారు.