రూ. 22.8 లక్షల దొంగనోట్ల పట్టివేత

రూ. 22.8 లక్షల దొంగనోట్ల పట్టివేత
  • ఒకరి అరెస్టు..ఇద్దరి పరారీ

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: దొంగనోట్లు మార్పిడి చేసే ముఠాను సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల పాత బస్ స్టాండ్ ప్రాంతంలో టౌన్ సీఐ వెంకటనర్సయ్య ఆధ్వర్యంలో  పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన స్వరాలం ప్రసాద్  అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకుని బ్యాగు తనిఖీ చేశారు. బ్యాగులో రూ. నాలుగు వేల అసలైన కరెన్సీ   నోట్లు, రూ. 22.8 లక్షల నకిలీ నోట్లు దొరికాయి. స్వరాలం ప్రసాద్ తోపాటు సత్తుపల్లికి చెందిన గుంశావళి, హైదరాబాద్ కు చెందిన మహేష్ ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లను మార్చేందుకు యత్నిస్తున్నారని తేలింది. గుంశావళి, మహేష్ లు కారు అక్కడి నుంచి పారిపోయారు. వీరిపై సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెంలో కేసులు ఉన్నట్లు తెలిసింది. ప్రసాద్​ను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్, టౌన్ సీఐ వెంకటనర్సయ్య, ఎస్సై సుధాకర్ పాల్గొన్నారు.