ర్యాపిడోలో గంజాయి పార్శిల్.. పోలీసులకు పట్టించిన డ్రైవర్

ర్యాపిడోలో గంజాయి పార్శిల్.. పోలీసులకు పట్టించిన డ్రైవర్

జీడిమెట్ల, వెలుగు: ర్యాపిడో డ్రైవర్ అప్రమత్తతతో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు కొనుగోలుదారుడు పోలీసులకు చిక్కారు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌‌‌‌కు చెందిన రూపేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ (23) గంజాయి విక్రయాలు చేస్తుండగా, ఆదివారం గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ర్యాపిడో ద్వారా పార్సిల్ పంపించాడు. 

పార్సిల్‌‌‌‌ను తీసుకున్న ర్యాపిడో డ్రైవర్ సత్తు ఆదర్శ్‌‌‌‌కు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు పార్సిల్‌‌‌‌ను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లు తేలింది. అనంతరం దర్యాప్తు చేపట్టి గంజాయి విక్రయిస్తున్న రూపేశ్‌‌‌‌కుమార్‌‌‌‌తో పాటు కొనుగోలుదారుడు వినోద్‌‌‌‌ను అరెస్టు చేశారు. కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టించిన ర్యాపిడో డ్రైవర్ సత్తు ఆదర్శ్‌‌‌‌ను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి అభినందించారు.