6 వేలు కొట్టేసిండని దోస్తును చంపిండు

6 వేలు కొట్టేసిండని దోస్తును చంపిండు
  •     డ్రైవర్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
  •     నిందితుడి అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఐదు రోజుల కిందట జరిగిన డ్రైవర్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. తన డబ్బులు దొంగిలించాడనే కోపంతో స్నేహితుడే అతడిని చంపినట్లు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్ నగర్ కు చెందిన వి. గణేశ్(34) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడి ఫ్రెండ్ అయోధ్యనగర్ కు చెందిన కాల సాయికృష్ణ(23) కూలి పనిచేసేవాడు.  మద్యానికి బానిసైన వీరిద్దరూ గత కొంతకాలంగా ఫుల్లుగా తాగుతూ రోడ్ల పక్కనే నిద్రపోతున్నారు. ఈ నెల 9న గణేశ్ నిద్రలో ఉండగా అతడి జేబులో నుంచి రూ.6,500ను సాయికిరణ్​దొంగిలించాడు. విషయం తెలుసుకున్న గణేశ్ అతడిపై పగ పెంచుకున్నాడు. ఈ నెల 11న సుభాష్​నగర్ లోని ఖాళీ స్థలం వద్ద సాయికిరణ్​తాగి పడుకోగా.. అక్కడికి వచ్చిన గణేశ్ అతడిపై దాడి చేసి చంపేశాడు. కేసు  దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు గణేశ్​ను రిమాండ్​కు తరలించారు