టీఆర్ఎస్ నేత నందకిషోర్, భగవంతరావులపై కేసు నమోదు

టీఆర్ఎస్ నేత నందకిషోర్, భగవంతరావులపై కేసు నమోదు

హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం మాట్లాతుండగా మైక్ లాగిన టీఆర్ఎస్ నేత నందకిషోర్ బిలాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న పోలీసులు.. ఐపీసీ 352, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై 504,352,341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి సీఎం హిమంతకు జరిగిన ఉదంతంపై వాకబు చేశారని డీజీపీ కార్యాలయం తెలిపింది. అస్సాం సీఎం భద్రతకు బాధ్యులైన సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొంది.

గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌ కు సీఎం హిమంత్ బిశ్వ శర్మ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా టీఆర్ఎస్ ​కార్యకర్త నందకిషోర్ స్టేజీ పైకి వచ్చి మైకును లాక్కున్నారు. ఇది  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్  గా మారింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని నందకిషోర్ ను అబిడ్స్​ పీఎస్​కు తరలించారు.