10th Paper Leak : వికారాబాద్ లో టెన్త్ పేపర్ లీక్.. ముగ్గురి సస్పెండ్

10th Paper Leak : వికారాబాద్ లో టెన్త్ పేపర్ లీక్.. ముగ్గురి సస్పెండ్

రాష్ట్రంలో  ఎగ్జామ్  పేపర్ లీకేజీల వ్యవహారం కలకలం రేపుతోంది. వికారాబాద్ తాండూరులో టెన్త్ పేపర్ లీక్  ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  వికారాబాద్ జిల్లా తాండూరులో  ఇన్విజిలెటర్ బందప్ప మొబైల్ నుంచి తెలుగు పేపర్ లీక్  అయినట్లు పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ లో  ముగ్గురు అధికారులు  సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్,   ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారు .పేపర్ లీక్ పై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు అధికారులు.

వికారాబాద్ జిల్లా తాండూరులో ఏప్రిల్ 3న  పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్షా పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది. దీంతో స్థానికంగా కొందరు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న  ఇన్విజిలెటర్ బందప్పను  పేపర్ లీకేజ్‌పై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే మొదట పేపర్ లీక్ కాలేదంటూ వికారాబాద్ డీఈవో రేణుక దేవి ఖండించారు. పేపర్ లీకేజ్ వార్తలను పోలీసులు నిర్ధారించారు. స్కూల్ కు వెళ్లిన పోలీసులు బందప్ప మొబైల్ నుంచి పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు.  మరోవైపు ఇదే విషయంపై కలెక్టర్ నారాయణ రెడ్డితో డీఈవో రేణుకా దేవి సమావేశమయ్యారు. 

ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ (TSPSC) నుంచి పేపర్లు లీకైన అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సమయంలో టెన్త్ పేపర్లు కూడా బయటకు వచ్చాయన్న వార్త అందరినీ షాక్ గురి చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది.

https://www.youtube.com/watch?v=ddbDQg03bxM