నవీన్ రెడ్డితో పాటు 40 మందిపై కేసులు

నవీన్ రెడ్డితో పాటు 40 మందిపై కేసులు

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ  కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నవీన్ రెడ్డిపై  పోలీసులు పీడీ యాక్ట్ కేసు చేశారు.ఇప్పటి వరకు నవీన్​రెడ్డిపై ఆదిభట్ల పీఎస్​లో 5 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్న రాచకొండ సీపీ చౌహాన్​.. అతనిపై పీడీ యాక్ట్​ నమోదు చేసినట్లు చెప్పారు. బీడీఎస్ విద్యార్థిని అయిన  వైశాలిని నవీన్ రెడ్డి గతేడాది డిసెంబర్లో  కిడ్నాప్ చేశాడు.  తనని పెళ్లి చేసుకోవాలని  ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. నవీన్ రెడ్డితో పాటు మరో 40 మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు.  నవీన్ రెడ్డిని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు.  వైశాలి ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ ఖాతాలతో వాటిని నవీన్‌రెడ్డి షేర్ చేసినట్లు పేర్కొన్నారు.