రేపు ఓల్డ్‌‌ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు ఓల్డ్‌‌ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
  • మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10‌‌‌‌ గంటల వరకు
  • చార్మినార్,చాదర్‌‌‌‌ఘాట్,మదీనా పరిసర ప్రాంతాల్లో డైవర్షన్స్

హైదరాబాద్‌‌,వెలుగు: మొహర్రం సందర్భంగా ఓల్డ్‌‌సిటీలో పోలీసులు శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీబీకా అలావా ఊరేగింపునకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10  వరకు సౌత్‌‌జోన్‌‌ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్స్‌‌ చేశారు.ఈ ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్‌‌, సౌత్‌‌జోన్‌‌ పోలీసులు శుక్రవారం పర్యవేక్షించారు.

ALSO READ:ఎమ్మెల్సీ కవితతో చంద్రశేఖర్‌‌ ఆజాద్‌ భేటీ

ఊరేగింపు ప్రారంభమయ్యే డబీర్‌‌‌‌పురాలోని బీబీకా ఆలాంను సంర్శించారు.నిర్వాహకులు పలు సూచనలు చేశారు.ట్రాఫిక్ చీఫ్‌‌ సుధీర్‌‌‌‌బాబు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.బీబీకా అలావా నుంచి డబీర్‌‌‌‌పురా,బడా బజార్‌‌‌‌,పురాణి హవేలి,యాకత్‌‌పుర,మొఘల్‌‌పురా,తలాబ్‌‌కట్ట,చార్మినార్‌‌‌‌,నయాపూల్‌‌, మదీనా క్రాస్ రోడ్స్‌‌,చాదర్‌‌‌‌ఘాట్‌‌,అఫ్జల్‌‌గంజ్‌‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు,డైవర్షన్స్‌‌ ఉంటాయని తెలిపారు.