తీన్మార్ మల్లన్న రిమాండ్ రిపోర్టులో 8మందిని చేర్చిన పోలీసులు

తీన్మార్ మల్లన్న  రిమాండ్ రిపోర్టులో 8మందిని చేర్చిన పోలీసులు

మార్చి 21న సాయి కరణ్ అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేయగా.. ఆయనకు 14రోజుల రిమాండ్ విధించారు.  మల్లన్నతో పాటు మరో ఆరుగురికి రిమాండ్ విధించి.. చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో 8 మంది నిందితులుగా ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిలో ఇప్పటికే ఆరుగురు అరెస్ట్ కాగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. మల్లన్న టీంపై మొత్తం రెండు ఘటనల్లో కేసు నమోదైనట్టు తెలిపారు. ఎస్ఓటీ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్న టీమ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. 148, 307, 342,506, 384, 109, r/w 149కింద కేసులు ఫైల్ చేశారు. 

విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ ను కిడ్నాప్ చేసి దాడి చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఫిర్జాదీగూడ, రాఘవేంద్ర భవన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను అడ్డుకున్నారన్నారు. Q న్యూస్ ఆఫీస్ కి తీసుకెళ్లి దాడి చేశాని, చైన్ స్నాచర్ల కోసం వెహికల్ చెకింగ్ చేస్తుండగా పోలీసులను నిలదీశారని తెలిపారు. మీరు ఎవరు, ఎందుకు వాహనాలు చెక్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారని చెప్పారు. మీ ఐడీ కార్డు చూపించాలని పోలీసులతో గొడవ పడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.