హైదరాబాద్సిటీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరుడైన పోలీస్ కిష్టయ్య సంస్మరణ సభను డిసెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దీనికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమానికి అప్పటి ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని సహించలేక ముదిరాజ్ బిడ్డ కృష్ణయ్య తుపాకీతో కాల్చుకొని అమరుడయ్యాడన్నారు. ప్రతి ఏడాది కృష్ణయ్య వర్ధంతిని నిర్వహిస్తున్నామని, అదే తరహాలో ఈ ఏడాది కూడా డిసెంబరు ఒకటిన అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
