ఆలేరులో ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్

ఆలేరులో ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రా వ్యాప్తంగా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత  పరిస్థితులు నెలకొన్నాయి.  ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ,కాంగ్రెస్ లీడర్ల మధ్య ఘర్షణ చెలేరేగింది. 

యాదాద్రి భువనగిరి జిల్లా  ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.  బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్తుండగా మహేందర్ రెడ్డిని అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి చేశారు. కేంద్రబలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టాయి.

మరో వైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్, మహేశ్వరం పరిధిలోని నార్ గుల్ జనగామ జిల్లా 245వ నెంబర్ పోలింగ్ కేంద్రం, గద్వాల జిల్లా ఐజా, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నాయకన్ గూడెంలో ,నిజామాబాద్  జిల్లా బోధన్ విజయమేరి, సంగారెడ్డి జిల్లా హత్నూర, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, పదర మండలం పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్,బీఆర్ఎస్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బిట్ల తండాలో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కారుపై యువకులు దాడి చేశారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.