టీచర్లపై చేయి చేసుకున్న పోలీసులు

టీచర్లపై చేయి చేసుకున్న పోలీసులు

డీఎస్ఈ ముట్టడికి ప్రయత్నించిన స్పౌజ్ టీచర్ల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీస్ వ్యాన్ ఎక్కేందుకు నిరాకరించిన టీచర్లపై చేయి చేసుకున్నారు. లక్డీకాపూల్లోని డీఎస్ఈ బిల్డింగ్ ముట్టడికి వచ్చిన టీచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. తామేం తప్పుచేశామని, ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని టీచర్లు ప్రశ్నించడంతో ఓ సీఐ ఉపాధ్యాయుడిపై చేయి చేసుకున్నారు. 

మరోవైపు టీచర్లతో పాటు వచ్చిన చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. తల్లిదండ్రులతో పాటు ధర్నాకు వచ్చిన పిల్లల్ని సైతం పోలీస్ వాహనాలు, డీసీఎంలలోకి ఎక్కించడంతో బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. కొందరు చిన్నారులు ఏం జరుగుతుందో తెలియక గుక్కపట్టి ఏడుస్తున్నారు.