హైదరాబాద్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ... పోలీసులు కొత్త రూల్స్

హైదరాబాద్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ...  పోలీసులు కొత్త రూల్స్

హైదరాబాద్ లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం పోలీసులు కొత్త రూల్స్  సిద్ధం చేశారు.  లారీలు, ట్రక్కులు, టస్కర్లు, ట్రాలీలకు డే టైమ్ లో సిటీలోకి అనుమతించరు.  రాత్రి వేళలోనూ వాటికి  కేటాయించిన రూట్లలో మాత్రమే అనుమతిస్తారు.  కన్స్ట్రక్షన్  ఎక్వీప్‌మెంట్‌ వాహనాలను కూడా పగటి వేళలో సిటీ లోకి అనమతించరు.  కేవలం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు వరకే వాటిని సిటీలోకి అనుమతిస్తారు.  

డీసీఎం, ఏచర్, స్వరాజ్ మజ్దా వంటి మీడియం గూడ్స్ వెహికిల్స్ కి ఉదయం 8 నుంచి 12 లోపు, సాయంత్రం 4 నుంచి 9 లోపు సిటీ రోడ్లపైకి అనుమతి నిరాకరించారు పోలీసులు.   2 టన్నులకు మించి నిర్మాణ వ్యర్థాలు తరలించే వాహనాలకు ఉదయం 9 నుంచి 11.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు జంట నగరాల రోడ్ల మీదకు పోలీసులు అనుమతి నిరాకరించారు.  

10 టన్నులకు మించి తరలించే ప్రభుత్వ వాహనాలకు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అనుమతి నిరాకరించారు.  అయితే  ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఏజెన్సీల బస్సులకు ఈ నిబంధనలు వర్తించవు.