హైదరాబాద్: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2026, మే 13వ తేదీ మధ్యాహ్నం పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం (మే 12) కరీంనగర్‌లోని బండి భగీరథ్ ఇంటికి వెళ్లారు పేట్ బషీర్బాద్ పోలీసులు.
ఈ సమయంలో భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు పోలీసులు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు అవుతాడా.. లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మహిళా ఐపీఎస్ఆఫీసర్రితిరాజ్ను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి సోమవారం మెమో జారీ చేశారు.
కేసుకు సంబంధించిన అన్ని అంశాలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరిశీలించాలని సీపీ రమేశ్ రెడ్డి ఆదేశించారు. వృత్తిపరమైన పద్ధతిలో నిబంధనలకు లోబడి దర్యాప్తు జరిగేలా చూడాలని సూచించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని దర్యాప్తు పురోగతి నివేదికను ప్రతిరోజూ తప్పనిసరిగా సమర్పించాలని సీపీ ఆదేశించారు. ఈ క్రమంలోనే కేసు విచారణను డీసీపీ రితిరాజ్ ముమ్మరం చేశారు.
