దుబ్బాకలో పోలీసుల హైడ్రామా.. కారులో డబ్బులున్నాయంటూ 9 గంటలపాటు స్టేషన్‌లోనే..

దుబ్బాకలో పోలీసుల హైడ్రామా.. కారులో డబ్బులున్నాయంటూ 9 గంటలపాటు స్టేషన్‌లోనే..

దుబ్బాకలో పోలీసుల హైడ్రామా

డబ్బులున్నాయంటూ బీజేపీ కార్యకర్త కారును అడ్డుకున్రు

9 గంటలు స్టేషన్ లోనే ఉంచిన్రు 

అర్ధరాత్రి ఆందోళనకు దిగిన రఘునందన్, కార్యకర్తలు

చివరికి తెల్లవారుజామున తనిఖీ చేసిన పోలీసులు

కారు సీట్లు, డోర్లు, డిక్కీ, స్టెప్నీలను విప్పి మరీ తనిఖీ

సిద్దిపేట, వెలుగు: బీజేపీ కార్యకర్త కారులో డబ్బులు ఉన్నాయంటూ దుబ్బాక పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారు. స్టేషన్ కు తీసుకెళ్లి తనిఖీ చేయకుండా ఆయన దగ్గరి నుంచి ఫోన్ లాక్కొని 9గంటల పాటు నిర్బంధించారు. బీజేపీ కార్యకర్త వంశీకృష్ణ సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో ఆ పార్టీ క్యాండిడేట్ రఘునందన్ రావును కలిసి కారు (టీఎస్ 7జే2 5665)లో తిరిగి వెళ్తుండగా దుబ్బాకలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారులో డబ్బులు తీసుకెళ్తున్నారనే సమాచారం ఉందని, తనిఖీ చేయాలని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీనిపై వంశీకృష్ణ వెంటనే రఘునందన్ రావుకు సమాచారం ఇవ్వడంతో అతని ఫోన్ లాక్కున్నారు. వెహికల్ ను వెంటనే తనిఖీ చేసి పంపించాలని రఘునందన్ రావు సిద్దిపేట సీపీని కోరారు. అయినా పోలీసులు రాత్రి 12:30 గంటల వరకు తనఖీ చేయకుండా వంశీకృష్ణను స్టేషన్ లోనే ఉంచుకున్నారు.

బీజేపీ కార్యకర్తల ధర్నా

నాలుగు గంటలైనా కారును తనిఖీ చేయకుండా వంశీకృష్ణను విడిచిపెట్టకపోవడంతో రఘునందన్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ 10 మంది ఎస్సైలు, 15 పోలీసు వాహనాలతో ఏఆర్ పోలీసులు మోహరించి ఉన్నారు. అదంతా గమనించిన రఘునందన్.. కారును తనిఖీ చేయకుండా వంశీకృష్ణను ఎందుకు నిర్బంధించారని పోలీసులను ప్రశ్నించారు. ఇదే టైమ్ లో ఎన్నికల అధికారి ఏసీపీ బాలాజీ అక్కడికి వచ్చి.. స్పెషల్ టీమ్స్ వస్తున్నాయని, తనిఖీ చేస్తాయని చెప్పారు. రఘునందన్ స్టేషన్ కు వచ్చిన విషయం తెలుసుకొని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్ కు చేరుకున్నారు. ఎంసీసీ టీమ్, స్పెషల్ స్క్వాడ్ తో తనిఖీ చేయాలని, ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ వెంటనే రావాలని రఘునందన్ డిమాండ్ చేశారు. తమ ఎదుటే కారును తనిఖీ చేయాలని కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై అర్ధరాత్రి 2గంటల టైమ్ లో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి రఘునందన్ సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని డీజీపీకి చెప్పి, దుబ్బాకకు రావాలని కోరారు. ఆయన వస్తున్నానని చెప్పడంతో, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మెయిన్ రోడ్డుపై ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆందోళనలో
పాల్గొన్నారు.

తెల్లవారుజామున తనిఖీ

బీజేపీ ఆందోళనతో తలొగ్గిన పోలీసులు మంగళవా రం తెల్లవారుజామున వంశీకృష్ణ వాహనా న్ని తనిఖీ చేశారు. కారు సీట్లు, డోర్లు, డిక్కీ, స్టెప్నీలో సెర్చ్ చేశారు. కొన్ని భాగాలను విప్పి మరీ చూ శారు. తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో డబ్బులు లేవని నిర్ధారించి, వెహికల్ ను విడిచిపెట్టారు. మొత్తం 9 గంటల పాటు పోలీసులు హైడ్రామా చేశారు. ఇదంతా ముగిసే వరకూ రఘునందన్ తో పాటు 500 మంది కార్యకర్తలు స్టేషన్ ముందే బైఠాయించారు.

ప్రభుత్వానికి తొత్తులుగా అధికారులు: రఘునందన్

కొందరు పోలీస్ అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి బీజేపీ కార్యకర్తలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. వంశీకృష్ణ కారును సోమవారం మధ్యాహ్నమే తూప్రాన్ వద్ద 3గంటల పాటు తనిఖీ చేశారని, డబ్బులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే వదిలి పెట్టారని చెప్పారు. అదే వాహనాన్ని తిరిగి తనిఖీ పేరుతో అడ్డుకున్నారని, కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇలా చేశారని అన్నారు. దీనిపై తాము పోలీసులను ప్రశ్నిస్తే  సమాధానం చెప్పకుండా, పక్కకు వెళ్లి ఫోన్ లో ఎవరితోనే మాట్లాడడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

For More News..

రైతులను సన్నొడ్లు వేయమంటివి.. నువ్వు దొడ్డొడ్లు వేస్తివి

కుండపోత వానలతో టెన్షన్​లో గ్రేటర్​ హైదరాబాద్​ జనం

ముంపు ప్రాంతాల్లో వారిని కాపాడేందుకు బోట్లు వచ్చినయ్