ఖమ్మంలో షర్మిల సభకు పోలీసుల అనుమతి

ఖమ్మంలో షర్మిల సభకు పోలీసుల అనుమతి

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఖమ్మంలో నిర్వహించాలని అనుకున్నారు. అందుకోసం అనుమతులివ్వాలని ఖమ్మం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు లక్కినేని సధీర్ పోలీసులను అనుమతులు కోరుతూ పిటిషన్ ఇచ్చారు. ఆయన పిటిషన్ పరిశీలించిన పోలీసులు.. ఏప్రిల్ 9న బహిరంగ సభకు అనుమతులిస్తన్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెవిలియన్ గ్రౌండ్‌లో 5 నుంచి 6 వేల మందితో సభను నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలిపారు. అయితే సభలో తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయోద్దని, సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించొద్దని, ట్రాఫిక్ జాం కాకుండా చూసుకోవాలని, పరిమితికి మించి కార్యకర్తలు రావొద్దని, సభా సమయం మించొద్దని పోలీసులు తెలిపారు.