
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై ఎస్ వోటీ పోలీసుల దాడులు చేశారు. కోకాపేట్ గ్రామం లేబర్ అడ్డాలో రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా 70 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.