మల్టీ లెవర్ మార్కెటింగ్ క్యూ నెట్ కార్యాలయాలపై సిసిఎస్ పోలీస్ ల దాడులు నిర్వహించారు. మార్చి 23న తెల్లవారుజామున మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ లో 6 చోట్ల పోలీసులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 20 మంది నిందితులను గుర్తించారు. ఇవాళ ఉదయం నుంచే మూడు రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. క్యూ నెట్ మోసాలపై తాజాగా మరో రెండు కేసులు నమోదు కావడంతో సోదాలు చేస్తున్నారు. సిసిఎస్ లో ఇప్పటికే క్యూ నెట్ పై ఆరు కేసులు నమోదయ్యాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించిన పోలీసులు.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్ లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
