పోలీసు నియమాకాలు వెంటనే చేపట్టాలి .. సీఎం ఆదేశాలు

 పోలీసు నియమాకాలు వెంటనే చేపట్టాలి  .. సీఎం ఆదేశాలు

రాష్ట్రంలో పోలీసు నియమాకాలు వెంటనే చేపట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్, వైద్యఆరోగ్య శాఖలో నియామకాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, అవకతవకలు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సెలెక్షన్ ప్రక్రియలో ఉన్న లోపాలు, పరిష్కారాలపై, రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన రిక్రూట్ మెంట్లపై నివేదిక ఇవ్వాలని కోరారు. 

పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరిగా ఉత్తర, దక్షిణ తెలంగాణాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ఏడేనిమిదేళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని.. వెంటనే రిక్రూట్ మెంట్ చేపట్టాలని ఆదేశించారు. వారి సేవలను ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వాడుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.