317 జీఓలో మార్పులు చేయాలి .. దామోదర రాజనర్సింహకు పోలీసుల వినతి

317 జీఓలో మార్పులు చేయాలి .. దామోదర రాజనర్సింహకు పోలీసుల వినతి

హైదరాబాద్, వెలుగు : 317 జీఓను సవరించి పోలీసులకు న్యాయం చేయాలని రాష్ట్ర పోలీస్​అధికారుల సంఘం కోరింది. సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ఎన్.శంకర్ రెడ్డి, రామగుండం కమిషనరేట్ అధ్యక్షుడు బి.పోచలింగం, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దుర్గారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్లు, సిద్దిపేట అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గురువారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు.

317 జీఓతో ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేశారు. పిల్లలు, తల్లిదండ్రులను, భార్యా భర్తలను విడదీసిన జీఓను సవరించాలని కోరారు. స్థానికత ఆధారంగా బదిలీలు ఉండేలా చూడాలన్నారు.