సునీల్ పై ఎఫ్ఐఆర్ : కేసీఆర్,కేటీఆర్,కవిత ఫోటోలు మార్ఫింగ్ చేసిండు

సునీల్ పై ఎఫ్ఐఆర్ : కేసీఆర్,కేటీఆర్,కవిత ఫోటోలు మార్ఫింగ్ చేసిండు

సునీల్ కనుగోలు కేసులో తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీపై నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ గళం పేరుతో సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను ట్రోల్ చేస్తూ వీడియోలు పెట్టారని తుకారంగేట్కు చెందిన సామ్రాట్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాయాబజార్ సినిమాలోని ఓ వీడియోలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఫేస్లను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సదరు వ్యక్తి  ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

సామ్రాట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని 41(a) నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17 న ఉదయం 10:30 కు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.