బీహార్ రైలులో 33 మంది బాలకార్మికులు.. సికింద్రాబాద్ తరలిస్తుండగా కాపాడిన పోలీసులు 

 బీహార్ రైలులో 33 మంది బాలకార్మికులు.. సికింద్రాబాద్ తరలిస్తుండగా కాపాడిన పోలీసులు 

కాజీపేట, వెలుగు: 33 మంది బాలకార్మికులను రైల్వే పోలీసులు రక్షించారు. బీహార్ నుంచి మైనర్లను పని కోసం సికింద్రాబాద్ తరలిస్తున్నారనే సమాచారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి పిల్లలను కాపాడారు. బీహార్ లోని దర్బంగా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న  రైలును బుధవారం రాత్రి కాజీపేటలో ఆపి రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. 33 మంది బాలకార్మికులను కాపాడి, వాళ్లను తరలిస్తున్న నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నట్లు కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు తెలిపారు. పిల్లలందరూ 14 నుంచి 17 ఏండ్ల లోపు వాళ్లేనని చెప్పారు. రైలులో మరింత మంది పిల్లలు ఉండొచ్చనే అనుమానంతో తనిఖీలు కొనసాగిస్తున్నామన్నారు.