
నల్గొండ జిల్లాలో అంతరాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. రూ.6 కోట్ల విలువ గల 220 టన్నుల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. మొత్తం 13 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... పరారీలో మరో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు వెస్ట్ జోన్ ఐజీ స్టిపెన్ రవీంద్ర, నిందితుల నుంచి రెండు కార్లు, 13 సెల్ ఫోన్లతో పాటు...మిషనరీ స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, హైదరాబాద్ లోని గుండ్ల పోచంపల్లి, బోయినపల్లి, దేవరయాంజల్ కేంద్రాలుగా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారన్నారు. వీరంతా పాత నేరస్తులుగా గుర్తించారు పోలీసులు. నైరుతి సీడ్స్ పేరుతో అక్రమ పత్తి, వరి, ఇతర కూరగాయల నాణ్యత లేని విత్తనాలను తయారీ చేస్తున్నారన్నారు.