
రాష్ట్రంలో నకిలీ విత్తనాలు కలకలం సృష్టిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసరలో ఇవాళ పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. సోదాల్లో 6 క్వింటాళ్ల 3 కిలోల బీటీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పట్టుబడిన విత్తనాల విలువ రూ.15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.