క్యాసినోలో రూ.18 లక్షలు లాస్.. ఫ్రెండ్ ​హత్య

క్యాసినోలో రూ.18 లక్షలు లాస్.. ఫ్రెండ్ ​హత్య

శంషాబాద్, వెలుగు: షాద్​నగర్​ లింగారెడ్డిగూడెం శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. క్యాసినోలో రూ.18 లక్షలు నష్టపోవడంతో ఫ్రెండ్స్​ మధ్య తలెత్తిన వివాదమే హత్యకు కారణమైందని గుర్తించారు. ఏపీలోని నంద్యాల జిల్లా బండిఆత్మకూరు పరిధిలోని చిన్నదేవులపురానికి చెందిన సాయిరాహుల్(23), శాఖమూరి వెంకటేశ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ కొన్నాళ్లుగా సిటీలో ఉంటున్నారు. ఆన్​లైన్​లో క్యాసినో ఆడే సాయి రాహుల్.. వెంకటేశ్​కు కూడా అలవాటు చేశాడు.  అలా వెంకటేశ్​ ఆన్​లైన్​లో క్యాసినో ఆడి రూ.15లక్షలు కోల్పోయాడు. తర్వాత తన సూచనలతో మరో రూ.3 లక్షలు పెట్టాలని సాయి రాహుల్ చెప్పగా, వెంకటేశ్​ రూ.3లక్షలు పెట్టి అవి కూడా పోగొట్టుకున్నాడు. 

ఈ క్రమంలో వెంకటేశ్, సాయి రాహుల్​ మధ్య గొడవలు జరిగాయి. సాయిరాహుల్ వల్లనే తాను డబ్బు మొత్తం పోగొట్టుకున్నానని, తన డబ్బు తిరిగి ఇవ్వాలని వెంకటేశ్​డిమాండ్ ​చేశాడు. డబ్బు ఇచ్చేది లేదని, ఏం చేసుకుంటావో చేసుకోపో అని సాయిరాహుల్ ​తేల్చి చెప్పడంతో వెంకటేశ్ కోపంతో ఊగిపోయాడు. సూరారంలోని తన స్నేహితుడైన కార్ డ్రైవర్ సాయంతో సాయి రాహుల్ ను చంపేందుకు స్కెచ్ ​వేస్తాడు. హత్యకు రూ.50 వేలు సుపారీ ఇచ్చాడు.

 మొత్తం రూ.2లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. కుత్బుల్లాపూర్​లో కత్తులు కొని ఈ నెల12వ రాత్రి పదిన్నర గంటల సమయంలో సాయి రాహుల్​ను లింగారెడ్డిగూడెంలోని నిర్మానుష ప్రదేశానికి పిలిపించాడు. మద్యం తాగి సాయిరాహుల్​ను కత్తితో పొడిచి చంపేశాడు. శవాన్ని అక్కడే పడేసి పరారయ్యారు. మృతుడి చేతిపై ఉన్న ‘జై బాలయ్య’ టాటూ ఆధారంగా ​పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడిందని శంషాబాద్ ఇన్​చార్జ్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆరాంఘర్​లో నిందితుడిని 

అరెస్ట్​ చేశామని చెప్పారు.