కవాడీగూడలో అదృశ్యమైన బాలిక సేఫ్​

కవాడీగూడలో  అదృశ్యమైన బాలిక సేఫ్​

హైదరాబాద్​ కవాడీగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయిని సురక్షితంగా తల్లిదండ్రలకు అప్పగించారు. కూతురిని చూడటంతో పేరెంట్స్​ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అమ్మాయిని   ఓయూ క్యాంపస్ లో ఉన్నట్టు  ట్రేస్ అవుట్ చేశారు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళడంతో  మానసిక పరిస్థితి సరిగా లేని కూతురిని ఇంట్లోనే ఉంటుంది. కాగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కూతురు ఫోన్ లిఫ్ట్​ చేయకపోవడంతో  అనుమానం వచ్చిన తండ్రి ఇంటికి వచ్చి చూశారు. ఇంట్లో అమ్మాయి కనిపించకపోవడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం 7,8 గంటల మధ్య కూతురి  ఫోన్ సిగ్నల్స్ నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో చూపించడంతో పోలీసులు, తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి సెర్చ్ చేశారు.అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. అనంతరం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో అమ్మాయి ఫోన్​ సిగ్నల్​ ఆధారంగా  కొన్ని గంటల వ్యవధిలోనే ఆమెను రక్షించారు.