ఇన్సూరెన్స్ పైసల కోసం చంపేసిన్రు

ఇన్సూరెన్స్ పైసల కోసం చంపేసిన్రు

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని మొగలి గిద్ద గ్రామ శివారులో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. ఇన్సూరెన్స్ పైసల కోసమే అతన్ని చంపి హత్యగా చిత్రీకరించారని తేల్చారు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు తన వద్ద పనిచేసే వారిని మోసం చేసి డబ్బులు దండుకునేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే మృతుని పేరిట ఇన్సూరెన్స్ చేయించి హత్య చేసినట్లు తేలింది. 

హైదరాబాద్ కు చెందిన శ్రీకాంత్ తన వద్ద పనిచేసే వారి పేరుతో క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకుని జల్సా చేసేవాడు. ఇదే క్రమంలో బిక్షపతి అనే వ్యక్తి శ్రీకాంత్ వద్ద పనికి కుదరగా.. అతని పేరిట రూ. 50లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు. నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా అతని పేరుతో ఇల్లు కొనుగోలు చేశాడు. అయితే శ్రీకాంత్ ఆ ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించగా బిక్షపతి నిరాకరించాడు. దీంతో అతన్ని హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. ఓ హెడ్ కానిస్టేబుల్ సహా మరో ఇద్దరితో కలిసి బిక్షపతిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగుచూడటంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.