పోలీసులు కొత్త నాటకానికి తెరలేపారు : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

పోలీసులు కొత్త నాటకానికి తెరలేపారు : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవ్వాళ్టి నుంచి 10 రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగేలా పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నర్సంపేట నియోజక వర్గం నెక్కొండ మండలం లింగగిరి గ్రామం వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించేలా రూట్ మ్యాప్ సైతం సిద్ధం అయింది. అయితే కోర్టు ఆదేశాలకనుగుణంగా అనుమతివ్వాల్సిన వరంగల్ పోలీసులు చివరి నిమిషం వరకు ఎదురు చుసే దోరణిగా వ్యవహరించి పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వాలో చెప్పాలి అంటూ షోకాజ్ నోటీస్ లు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లు బూచిగా చూపెట్టే ప్రయత్నం చేశారని ఆ పార్టీ తెలిపింది. 

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న పాదయాత్రను అడ్డుకొనే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిబంధనలను ఉల్లగించిందని కొత్త నాటకానికి పోలీసులు తెరలేపారని ఆ పార్టీ ఆరోపించింది. పాదయాత్రను అడ్డుకొనే విధంగా కుట్రలు జరిగినా..ఈ అంశం పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ న్యాయ పరంగా నోటీసులకు వివరణ ఇవ్వడం తో పాటు కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఇవ్వాళ ఒక్క రోజు  పాదయాత్రకు విరామం ప్రకటించడం జరిగింది. వరంగల్ పోలీసులకు న్యాయబద్ధంగా వివరణ ఇస్తామని..అప్పటికీ అనుమతి ఇవ్వక పోతే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని.. పాదయాత్రను అడ్డుకొనేలా అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు తిప్పి కొడతామని పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు తెలిపారు.