
నాగోల్ లో మహాదేవ్ జ్యూవెలరీ షాప్ లో కాల్పులు జరిపి పారిపోయిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం రాచకొండ పోలీసుల అదుపులో నిందితులున్నారు. గోల్డ్ సప్లయర్, యజమానిపై గురువారం రాత్రి కాల్పులు జరిపి బంగారం, నగదుతో నిందితులు ఎస్కేప్ అయ్యారు.
దోపిడికి వాడిన బైక్, స్కూటీ చోరీ చేసినవిగా గుర్తించారు. చోరీ చేసిన వారిని ఇంటర్ స్టేట్ గ్యాంగ్ సభ్యులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు, ఘటనా స్థలంలో లభ్యమైన సాక్ష్యాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు 15 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు.