V6 News

మునుగోడులో పొలిటికల్ హీట్.. బీజేపీ బహిరంగ సభ

మునుగోడులో పొలిటికల్ హీట్.. బీజేపీ బహిరంగ సభ

మునుగోడు బీజేపీ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏx మాట్లాడుతారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శనివారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... అమిత్ షా తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు సభ వేదికగా సీఎం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తామని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అవినీతి చిట్టా బయట పెడతామన్నారు. దీంతో షా ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. 

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు 15 మంది కార్పొరేటర్లు అమిత్ షాకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ టెంపుల్ కు చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.