V6 News

బ్యాంకింగ్ రూల్స్ కు పాటించడం లేదంటూ..పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌‌ రద్దు

బ్యాంకింగ్ రూల్స్ కు పాటించడం లేదంటూ..పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌‌ రద్దు

న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌‌ను రద్దు చేస్తూ ఆర్​బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకు వ్యవహారాలు సాగిస్తున్న తీరు డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని శుక్రవారం పేర్కొంది.  బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. లైసెన్స్ రద్దు కావడంతో ఇకపై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదు. బ్యాంకును పూర్తిగా మూసివేసే ప్రక్రియ (వైండింగ్ అప్) కోసం ఆర్​బీఐ త్వరలోనే హైకోర్టులో దరఖాస్తు చేయనుంది. డిపాజిటర్లు అందరికీ వారి సొమ్మును తిరిగి చెల్లించడానికి సరిపడా నగదు నిల్వలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వద్ద ఉన్నాయని ఆర్​బీఐ వెల్లడించింది.