V6 News

 ఉపాధి షూటింగ్‌‌‌‌‌‌‌‌..  ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ విన్నూత ఆలోచన

 ఉపాధి షూటింగ్‌‌‌‌‌‌‌‌..  ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ విన్నూత ఆలోచన

ఫొటోలో కనిపిస్తున్న సెటప్‌‌‌‌‌‌‌‌ సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌ కోసం వేసింది కాదు.. ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆలోచన. ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఫేస్‌‌‌‌‌‌‌‌ రికగ్నేషన్‌‌‌‌‌‌‌‌ హాజరు విధానాన్ని తీసుకొచ్చింది. అయితే కొందరు కూలీల ఫేజ్‌‌‌‌‌‌‌‌ కాప్చర్‌‌‌‌‌‌‌‌ అవకపోవడంతో వారు పనులకు దూరం అవుతున్నారు.

మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామంలో చెరువు కింద నీటి కాల్వ పనులు చేపడుతుండగా.. కూలీల ఫేస్‌‌‌‌‌‌‌‌ రికగ్నేషన్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వినూత్నంగా ఆలోచించిన ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ పని ప్రదేశం వద్ద సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌ మాదిరిగా... రెండు కర్రల మధ్య తెల్లటి వస్త్రం కట్టి, ఫోన్‌‌‌‌‌‌‌‌ కెమెరాపైన లైట్‌‌‌‌‌‌‌‌ పడకుండా గొడుగు ఏర్పాటు చేయడంతో పాటు ట్రైపాడ్‌‌‌‌‌‌‌‌ విధానంలో ఫేస్‌‌‌‌‌‌‌‌ స్కాన్‌‌‌‌‌‌‌‌ చేస్తూ హాజరును నమోదు చేస్తున్నారు.  – అల్లాదుర్గం, వెలుగు