వరంగల్, వెలుగు: బీజేపీ రాష్ట్ర నాయకుడు, హనుమకొండ (వరంగల్ పశ్చిమ) మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు గుండెనొప్పితో చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్య నేపథ్యంలో శుక్రవారం నివాళులర్పించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‍తో కలిసి నర్సంపేట నియోజకవర్గంలోని ముత్తోజీపేటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎండలో ఆందోళన, అక్కడ జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురయ్యారు. దీనిని గమనించిన అనుచరులు తీసుకెళ్లి సపర్యలు చేశారు. అప్పటికీ కొంత ఇబ్బందిగానే కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారావుకు శ్వాస ఇబ్బంది జరిగి గుండెనొప్పి అనిపించడంతో పార్టీ నేతలు హుటాహుటిన గ్రేటర్ వరంగల్ తరలించి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.

