చట్టం దృష్టిలో అందరూ సమానమే అని మరోసారి రుజువైంది. కామన్ మ్యాన్ అయినా.. రాజకీయ నాయకుడు అయినా శిక్ష తప్పదని తేలిపోయింది. 23 ఏళ్ల క్రితం కిడ్నాప్, మర్డర్ కేసులో కేసు నిందితునిగా ఆరోపనలు ఎదుర్నొంటున్న ముఖ్తార్ అన్సారీకి.. శనివారం (ఏప్రిల్ 29) నాడు ఘాజీపూర్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది.
గ్యాంగ్ స్టర్ చట్టం కింద 1999 సెప్టెంబర్ 23న అలహాబాద్ లో ముఖ్తార్ అన్సారీ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనతో పాటు బీఎస్పీ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీ కూడా కిడ్నాప్, మర్డర్ కేసుల్లో ఆరోపనలు ఎదుర్కొన్నారు. శనివారం (ఏప్రిల్ 29) జరిగిన విచారణలో ఘాజీపూర్ పూర్ కోర్టు తీర్పు వెలువరించింది.
ముఖ్తార్ అన్సారీ 5సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1996లో విశ్వహిందూ పరిషత్ నేత నందకిశోర్ రుంగ్తాను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు ఆరోపనలు ఉన్నాయి. అంతేకాకుండా 2005 లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ ని హత్య చేసినట్లు, 2001లో జరిగిన ఉర్సీ చట్టి గ్యాంగ్ వార్ లో కూడా అన్సారీపై మర్డర్ కేస్ నమోదయింది. వీటన్నింటినీ పరిగనంలోకి తీసుకున్న కోర్టు ఐపీసీ సెక్షన్ 302, 147, 148, 149 కింద ముఖ్తార్ అన్సారీపై కేసులు నమోదు చేశారు.