తెలంగాణలో మే 13న పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్

తెలంగాణలో మే 13న పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్

దేశ వ్యాప్తంగా ఎన్నికల  నగారా మోగింది.  సార్వత్రిక ఎన్నికలతో పాటుగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఈసీ ప్రకటించింది.  ఇక తెలంగాణలోఎంపీ ఎన్నికలకు మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు.   జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
ఏప్రిల్ 18వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 25వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
ఏప్రిల్ 26వ తేదీ : నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
మే 13వ తేదీ : తెలంగాణ పార్లమెంట్ పోలింగ్
జూన్ 4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు