ఢిల్లీ సర్కారు కొత్త రూల్

ఢిల్లీ సర్కారు కొత్త రూల్

కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 25 నుంచి వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని బంకులను ఆదేశించింది. సెప్టెంబర్ 29న ఎన్విరాన్ మెంట్, ట్రాన్స్ పోర్ట్, ట్రాఫిక్ డిపార్ట్ మెంట్లతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. 

వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు అక్టోబర్ 25 నుంచి వెహికిల్ పొల్యూషన్ సర్టిఫికెట్ చూపించిన వారికే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తారని మంత్రి స్పష్టం చేశారు. ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ లెక్కల ప్రకారం 2022 జులై నాటికి ఢిల్లీలో 13 లక్షల ద్విచక్ర వాహనాలు, 3 లక్షల కార్లు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండానే తిరుగుతున్నాయి. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు దొరికితే మోటర్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం సదరు వాహనదారులకు 6 నెలల జైలు శిక్ష లేదా రూ.10వేలు జరిమానా లేదా రెండు శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.