
హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్–2025) ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 92.64 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 246 ఎగ్జామ్ సెంటర్లలో మంగళవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకూ పరీక్ష నిర్వహించారు.
ఈ ఎగ్జామ్కు 1,06,716 మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా, వారిలో 98,858 మంది అటెండ్ అయ్యారని ఎస్బీటీఈటీ సెక్రెటరీ ఏ. పులయ్య తెలిపారు. 57,178 మంది బాయ్స్ కు 53,086(92.84%) మంది, బాలికలు 49,538 మందికి 45,772 (92.4%) మంది ఎగ్జామ్ కు హాజయ్యారని వెల్లడించారు. కాగా, పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, డిప్లొమా తదితర కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.