దానిమ్మతో కీళ్ల నొప్పులకు చెక్..

దానిమ్మతో కీళ్ల నొప్పులకు చెక్..

దానిమ్మ గింజల్లో పోషకాలు ఎక్కువ. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌ కారకాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మలో అధికంగా ఉండే పోషకాలు గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులనూ నయం చేస్తాయి. రక్త ప్రసరణకు అడ్డుగా ఏర్పడిన కణితులను తొలగించి, కణితి పెరుగుదలకు ఉపయోగపడే కారకాలను యాంటీ ఆక్సిడెంట్లు నాశనం చేస్తాయి.

బ్రెయిన్‌ ఆపరేషన్లు, గుండె మార్పిడి వంటి చికిత్సలు చేయించుకున్నవారు, దానిమ్మరసాన్ని తాగడం ద్వారా త్వరగా కోలుకుంటారు. కీళ్ల నొప్పులను తొలగించడంలోనూ దానిమ్మ సహకరిస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములను నాశనం చేస్తుంది. దానిమ్మ రసాన్ని పిల్లలకు తాగించడం ద్వారా వాళ్లలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.