విష్ణువర్దన్కు షాక్.. ప్రముఖుల సీట్లు మారినయ్

విష్ణువర్దన్కు షాక్.. ప్రముఖుల సీట్లు మారినయ్

కాంగ్రెస్ 45 మందితో సెకండ్ లిస్టు రిలీజ్ చేసింది. ఇటీవల 55 మందితో తొలి జాబితా రిలీజ్ చేసిన కాంగ్రెస్ ఇవాళ 45 మందితో సెకండ్ లిస్టు రిలీజ్ చేసింది. అయితే ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఫస్ట్ లిస్టులో చోటు దక్కిన సీనియర్ నేతలకు సెకండ్ లిస్టులో చోటు దక్కింది. అయితే  పీజేఆర్ కొడుకు పి విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లీహిల్స్ సీటు దక్కలేదు. ఆయన ప్లేసులో అజారుద్దీన్ కు ఇచ్చారు.  అయితే  ఇవాళ రిలీజ్ చేసిన జాబితాలో సీటు దక్కించుకున్న  ప్రముఖులు ఎవరో ఒకసారి  చూద్దాం.

 • హుస్నాబాద్ : పొన్నం ప్రభాకర్
 • దుబ్బాక్ : చెరుకు శ్రీనివాస్ రెడ్డి
 • ఇబ్రహీం పట్నం: మల్ రెడ్డి రంగారెడ్డి
 • ఎల్బీ నగర్ : మధుయాష్కి గౌడ్
 • మహేశ్వరం: కిచెన్నగారి లక్ష్మారెడ్డి
 •  ఖైరతాబాద్: పి. విజయారెడ్డి
 • జూబ్లీహిల్స్:  అజారుద్దీన్
 • సికింద్రాబాద్ కంటోన్మెంట్: గద్దర్ కూతురు వెన్నెల
 • మహబూబ్ నగర్ : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
 • మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
 • భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి
 • పరకాల: రేవూరి ప్రకాశ్ రెడ్డి
 • వరంగల్ ఈస్ట్: కొండా సురేఖ
 • పినపాక: పాయం వెంకటేశ్వర్లు
 • ఖమ్మం: తుమ్మల నాగేశ్వర్ రావు
 • పాలేరు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి