నా పోటీ ఎక్కడనేది.. ఏఐసీసీ నిర్ణయిస్తుంది: పొంగులేటి

నా పోటీ ఎక్కడనేది.. ఏఐసీసీ నిర్ణయిస్తుంది: పొంగులేటి
  • స్టేట్ పాలిటిక్స్ పైనే ఇంట్రస్ట్‌‌‌‌
  • జమిలిపై క్లారిటీ వచ్చాక కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్​
  • మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్టేట్ పాలిటిక్స్ పైనే తనకు ఇంట్రెస్ట్ ఉందన్నారు. ఎంపీగా పోటీ చేయమని ఏఐసీసీ ఆదేశిస్తే తాను పోటీ చేస్తానన్నారు.  ఆదివారం తాజ్ కృష్ణలో పొంగులేటి మీడియాతో  చిట్ చాట్ నిర్వహించారు.  

ఉమ్మడి ఖమ్మంలో  కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు అధికార పార్టీ అభ్యర్థులను ఓడించాలన్నదే తన గోల్ అని ఆయన స్పష్టం చేశారు.  క్యాస్ట్​ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని టికెట్లు కేటాయించే అవకాశం ఉందన్నారు. ఖమ్మంలో మంత్రి అజయ్​కి పోటీ గా అదే సామాజిక వర్గానికి చెందిన  మాజీ మంత్రి తుమ్మలను, పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యేపై తనను పోటీకి దించే అవకాశం ఉందని, ఏఐసీసీ ఈ అంశాన్ని పరిశీలిస్తుందన్నారు.  

జమిలిపై క్లారిటీ వచ్చాక  అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని,  ఈ నెల చివరికి కాంగ్రెస్  ఫస్ట్ లిస్ట్ వచ్చే చాన్స్ ఉందన్నారు. ఈ నెల 22 తరువాత మైనంపల్లి చేరిక ఉండొచ్చన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేరికపై చర్చలు జరుగుతున్నాయన్నారు. షర్మిల పొత్తు, పార్టీ విలీనంపై క్లారిటీ రావడం కోసం కొంత టైం పడుతుందన్నారు.