బూత్ లెవల్‌‌‌‌కు మోదీ సేవలను తీసుకెళ్లాలి : బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి 

బూత్ లెవల్‌‌‌‌కు మోదీ సేవలను తీసుకెళ్లాలి : బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీకి సేవ చేయడం అనేది కేవలం ఓ కార్యక్రమం కాదని, అది ఆయన జీవన విధానమని బీజేపీ జాతీయ సహ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం దేశమే ముందు అనే దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. బుధవారం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో నిర్వహించిన ‘మోదీజీ సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం కేవలం సభలు, బ్యానర్లు, ప్రచారానికే పరిమితం కాకూడదని సూచించారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను కలిసి, వారి స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. తమిళ భాష, సంస్కృతిపై ప్రధాని మోదీకి ఉన్న అపారమైన గౌరవంతోనే పార్లమెంట్‌‌‌‌లో పవిత్రమైన 'సెంగోల్' ప్రతిష్టాపన జరిగిందని తెలిపారు.