న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్ ను తమిళనాడు, కర్నాటక నేషనల్ కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో నితిన్ నబిన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నితిన్ నబిన్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా పార్టీ మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలం విజయవంతంగా, ప్రభావవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
