బాధలు చెప్పేందుకు వెళితే.. పార్టీలో వినే వాళ్లే లేరు : పొన్నాల కన్నీళ్లు

బాధలు చెప్పేందుకు వెళితే.. పార్టీలో వినే వాళ్లే లేరు : పొన్నాల కన్నీళ్లు

బీసీ బిడ్డను  కావడం వల్లే తనను  కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య. తనను అవమాన పర్చి హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  45 ఏళ్ల రాజకీయ జీవితంలో  ఈ స్థితికి రావడం బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని..కానీ తనకు జరిగిన అవమానాలతో రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కన్నీరు పెట్టుకున్నారు. 

 
మూడు సార్లు గెలిచా..కానీ..

పేద కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చిన తాను..జనగామ నుండి వరుసగా మూడు సార్లు గెలిచానని..12 ఏళ్లుగా మంత్రిగా పనిచేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ..పొన్నాల కన్నీరు పెట్టుకున్నారు. 

పదవుల కోసం కాదు..

తాను పదవుల కోసం రాజీనామా చేయలేదన్నారు పొన్నాల లక్ష్యయ్య. కాంగ్రెస్ లో కొద్ది మందికే ప్రాధాన్యత ఇచ్చారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇది భరించలేకనే తాను కాంగ్రెస్ కు రాజీనామా చేశానని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను  అధిష్టానానికి చెప్పేందుకు వెళ్తే వినేవాళ్లు లేరన్నారు. భవిష్యత్తు గురించి తాను ఆలోచించలేదని  పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.