
హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర ప్రజల ముందుకు సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ గ్యారెంటీల మీద చర్చకు రాకుండా ఫాం హౌస్లో పడుకుని..ఆయన తన పార్టీ నేతలతో మాట్లాడిస్తున్నారని ఫైర్ అయ్యారు. గురువారం పొన్నాల గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన ఏ మాట మీదా కేసీఆర్ నిలబడలేదని విమర్శించారు.
కరెంట్ విషయంలో ప్రజలపై రూ.50 వేల కోట్ల భారాన్ని మోపారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల్లోనూ అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చిందని చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన గ్యారెంటీ స్కీములనూ అమలు చేస్తామన్నారు. మహిళా బిల్లు ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వెల్లడించారు.