ఆర్టీసీ ఉద్యోగులతో డిపో మేనేజర్లు స్నేహపూర్వకంగా ఉండాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ ఉద్యోగులతో డిపో మేనేజర్లు స్నేహపూర్వకంగా ఉండాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్‌‌‌‌లో మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది, ప్రయాణికులతో అధికారులు ముఖ్యంగా డిపో మేనేజర్లు స్నేహపూర్వకంగా మెలగాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శనివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్​ నిర్వహించారు.  ఆర్టీసీ  సిబ్బంది సమస్యలను వినేందుకు ప్రతి నెల రెండో మంగళవారం అన్ని డిపోలలో ఫిర్యాదుల పరిష్కార సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 17లోపు అన్ని డిపోలు, బస్సు స్టేషన్లలో కనీస సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ వారిని సమన్వయం చేసుకుంటూ మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలయ్యేలా చూడాలని చెప్పారు.