హైదరాబాద్ రోడ్లపైకి 60 ఎలక్ట్రిక్ బస్సులు.. కూకట్ పల్లిలో ప్రారంభించనున్న మంత్రి పొన్నం

హైదరాబాద్ రోడ్లపైకి 60 ఎలక్ట్రిక్ బస్సులు.. కూకట్ పల్లిలో ప్రారంభించనున్న మంత్రి పొన్నం

హైదరాబాద్ రోడ్లపైకి 60 ఎలక్ట్రిక్ బస్సులు.. కూకట్​పల్లిలో ప్రారంభించనున్న మంత్రి పొన్నంహైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ఆర్టీసీ 500 ఎలక్ట్రిక్​బస్సుల ప్రాజెక్టులో భాగంగా మరో 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు బుధవారం  సిటీ రోడ్లపైకి రానున్నాయి. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఆర్టీసీ భాగస్వామ్యంతో ఓలెక్ట్రా తయారు చేసిన 12 మీటర్ల లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి డిపోలో బుధవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రారంభించనున్నారు. 

500 ఎలక్ట్రిక్​బస్సుల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంటోన్మెంట్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీయూ , మియాపూర్, హయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, రాణిగంజ్ డిపోలకు 440 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వగా, బుధవారం కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి డిపోకు 60 బస్సులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం సిటీలో రోజుకు లక్ష మంది ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తుండగా, కొత్తగా వచ్చే బస్సులతో కలిపి ప్రయాణికుల సంఖ్య 1.2 లక్షలకు చేరే అవకాశం ఉంది.