అందుకే నా ఫోన్ నెంబర్ ను ప్రైవేట్ యాప్స్ లో పెట్టిండు

V6 Velugu Posted on Jul 21, 2021

ముంబయి: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై దుమారం చెలరేగుతున్న నేపధ్యంలో పూనంపాండే గళం విప్పింది.2019లో తనతో కలసి పార్ట్ నర్ షిప్ లో యాప్ ప్రారంభించారని.. అయితే ఆదాయం విషయంలో అవకతవకలకు పాల్పడి తనను మోసం చేశాడని పూనంపాండే ఆరోపించింది. అతని అవకతవకలను గుర్తించి తాను పార్ట్ నర్ షిప్ బిజినెస్ నుంచి విడిపోతున్నట్లు నోటీసులు పంపానని తెలిపింది. దీన్ని సహించలేక రాజ్ కుంద్రా నా ఫోన్ నెంబర్, ఫోటోలు ప్రైవేట్ యాప్స్ లో ఉంచడంతో తనకు ఎంతో మంది నుంచి అసభ్య సందేశాలు, వీడియోలు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వేధింపులు భరించలేక ప్రశాంతత కోసం మూడు నెలలపాటు దేశం విడిచి వెళ్లిపోయానని పూనం పాండే వివరించింది. రాజ్ కుంద్రా అరెస్టు కావడంపై స్పందిస్తూ అతనికి శిక్ష పడాల్సిందేనని పేర్కొంది. తాను కూడా 2019లో బాంబే హైకోర్టులో రాజ్ కుంద్రాపై పిటిషన్ వేసి న్యాయం కోసం ఎదురుచూస్తున్నానని పూనంపాండే ప్రకటించింది.

Tagged Bollywood, poonam pandey, Raj Kundra, Raj kundra arrest, Poonam Pandey Phone Number

Latest Videos

Subscribe Now

More News