పాక్ మాజీ హై కమిషనర్ తప్పుడు ట్వీట్.. స్పందించిన పోర్న్ స్టార్

పాక్ మాజీ హై కమిషనర్ తప్పుడు ట్వీట్.. స్పందించిన పోర్న్ స్టార్

పుల్వామా దాడి, ఆర్టికల్ 370 రద్దు.. ఈ కారణాలతో పాక్ భారత్ పై బురదజల్లేందుకు యత్నిస్తోంది. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బసీత్..  ఆర్టికల్ 370 రద్దు కారణంగా కశ్మీర్‌లో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఓ తప్పుడు ట్వీట్ చేసి నవ్వుల పాలయ్యారు. “అనంతనాగ్‌లో యూసుఫ్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ గాయాలతో కంటి చూపు కోల్పోయాడు. అతని కుటుంబ సభ్యుల వేదన చూడండి. ఇప్పటికైనా నోరు విప్పండి. అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లండి” అంటూ ఓ  ఫోటోను షేర్  చేశాడు. ఆ ఫోటో పోర్న్‌ స్టార్‌ జానీ సిన్స్‌ ది  కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బషీత్‌ చేసిన తప్పిదాన్ని పసిగట్టిన ఆ దేశ జర్నలిస్టు నైనా ఇనాయత్‌… పాకిస్తాన్‌ మాజీ హైకమిషనర్‌ అబ్దుల్‌ బసిత్‌ పప్పులో కాలేశారు. ఆయన ట్వీట్‌ చేసింది పోర్న్‌ స్టార్‌ జానీ సిన్స్‌ ఫొటో. అసత్య ప్రచారమంటే ఇదే కావొచ్చు’అని ట్వీట్‌ చేశారు.

తాను చేసిన తప్పిదాన్ని గ్రహించిన బసిత్‌ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు. అయితే, అప్పటికే అది వైరల్‌ అయింది.ఇక ఈ వ్యవహారంపై సదరు పోర్న్‌ స్టార్‌ స్పందించారు. బసిత్ తన ఫొటోను తప్పుగా పేర్కొనడంతో సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం లభించిందని జానీ సిన్స్‌ చెప్పాడు. ‘బసిత్‌ చేసిన పని నాకు ఎక్కడా లేని ప్రచారం తెచ్చిపెట్టింది. ట్విటర్‌లో ఫాలోవర్స్‌ పెరిగారు. కానీ, అతను చేసింది సరైంది కాదు. నాకైతే కంటి చూపు బాగానే ఉంది. బసిత్‌ తన దృష్టి లోపాన్ని సరిచేసుకుంటే మంచిది’ అని ట్వీట్‌ చేశాడు.