మెగా డాటర్ కొణిదెల నిహారిక వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్నాక, ఆమె తన పూర్తి దృష్టిని కెరీర్ పై పెట్టింది. ఇటీవల 'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నిహారిక, ఇప్పుడు 'రాకాస' అనే మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా నిహారిక తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.
రెండ్లో పెళ్లిపై క్లారిటీ..
తన వివాహ బంధం బ్రేకప్ కు అనేక కారణాలు ఉన్నాయని నిహారిక తెలిపింది. తమ రిలేషన్ షిప్ నుంచి బయటకు రావాలని నిర్ణయించినప్పుడు తొలుత నాన్న నాగబాబుతో మాట్లాడా. నేను సంతోషంగా లేనని ఆయన గ్రహించారు. జీవితంలో హ్యాపీగా లేనప్పుడు బలవంతంగా కొనసాగాల్సిన అవసరం లేదు అని చెప్పారు. దీంతో పరస్పర అంగీకారంతో విడిపోయామని నిహారిక చెప్పింది. ఇటీవల తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై నిహారిక ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయితే భవిష్యత్తు లోమళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం లేకపోలేదని, అన్నీ కాలమే నిర్ణయిస్తుందన్నారు. సరైన వ్యక్తి నా జీవితంలోకి రావాల్సి వస్తే తప్పక వస్తాడని చెప్పుకొచ్చింది.
నాలుగేళ్ల తర్వాతే తెలిసింది..
తన అన్నయ్య పరుణ్ తేజ్, వదిన లావణ్య త్రిపాఠిల ప్రేమ కథ గురించి కూడా ఆమె కొన్ని రహస్యాలను బయటపెట్టింది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారన్న విషయం తసకు నాలుగేళ్ల తర్వాతే తెలిసిందని, అప్పటి వరకు వారు ఆ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారని తెలిపింది. వరుణ్ తేజ్ బయటకు ఇంట్రోవర్ట్ లా కనిపించినా, చాలా సరదాగా ఉంటాడని, తనను ఎప్పుడూ ఆటపట్టిస్తూనే ఉంటాడని నిహారిక తెలిపింది.
