హార్ముజ్ దాటుతున్న మరో రెండు LPG నౌకలు..!స్వదేశానికి జాగ్ వసంత్ ,పైన్ గ్యాస్

హార్ముజ్ దాటుతున్న మరో రెండు LPG నౌకలు..!స్వదేశానికి జాగ్ వసంత్ ,పైన్ గ్యాస్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ కు చెందిన రెండ ఎల్ పీజీ నౌకలు హార్ముజ్​ జలసంధి దాటి స్వదేశం వైపు  పయనిస్తున్నాయి. అమెరికా, ఇరాన్​ యుద్దం కారణంగా చమురు, గ్యాస్​ సరఫరాకు కీలకమైన హార్ముజ్​ జలసంధిని ఇరాన్​ మూసివేయడంతో భారత్​ తోపాటు వివిధ దేశాలకు చెందిన వందలాది చమురు నౌకలు ఆ ప్రాంతంలో నిలిచిపోయాయి.  భారత ప్రభుత్వం దౌత్య పరమైనప్రయత్నాల తర్వాత కీలకమైన ఇంధనాన్ని మోసుకొస్తున్న ఈ నౌకలు భారత్​ ఎల్ పీజీ నౌకలు జగ్​ వసంత్, పైన్​ గ్యాస్​ వ్యూహాత్మక హార్ముజ్​ జలసంధి ద్వారా భారత్ వైపు ప్రయాణిస్తున్నాయి. 

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత జెండా ఉన్న  జాగ్‌ వసంత్  పైన్ గ్యాస్ అనే రెండు ఎల్‌పీజీ వాహక నౌకలు అత్యంత సున్నితమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి సిద్ధమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం..ఈ రెండు నౌకలు పర్షియన్ గల్ఫ్ నుంచి భారతదేశం వైపు పయనమయ్యాయి. ప్రస్తుతం లారక్ - ఖేష్మ్ (Larak Qeshm) జలమార్గం దిశగా సాగుతున్నాయి. ఈ జలసంధిని దాటిన తర్వాత  ఆ నౌకలు తమ ఎల్‌పీజీ నిల్వలతో నేరుగా భారత ఓడరేవులకు చేరుకోనున్నాయి. 

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య  యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి హార్మజ్ జలసంధి ప్రాంతంలో నౌకాయానం తీవ్రంగా స్తంభించిపోయింది. దీంతో ఇరాన్ ,ఒమన్ మధ్య వందలాది నౌకలు నిలిచిపోయాయి. అయితే, భారతదేశం జరిపిన దౌత్యపరమైన చొరవ ఫలితంగా గత వారమే  శివాలిక్ నందా దేవి అనే రెండు భారతీయ నౌకలు సురక్షితంగా ఆ మార్గాన్ని దాటి గుజరాత్ చేరుకున్నాయి. 

భారత్ దౌత్యం.. 

అంతకుముందు మార్చి 20న, గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు మిత్రదేశాలతో భారత్ చర్చలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం కారణంగా వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రూ.497 కోట్ల విలువైన సహాయక ప్యాకేజీని ప్రకటించింది.

హార్ముజ్ జలసంధిని ఇరాన్  అప్రకటితంగా మూసివేయడాన్ని తప్పుపడుతూ 20కి పైగా దేశాలు తీవ్రంగా ఖండించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా ,పలు యూరోపియన్ దేశాలతో కూడిన  అంతర్జాతీయ కూటమి.. వాణిజ్య నౌకలపై ఇరాన్ జరుపుతున్న దాడులను, చమురు ,గ్యాస్ మౌలిక సదుపాయాలపై చేస్తున్న దాడులను తప్పుబట్టాయి.